Tuesday, November 26, 2024

న్యూయార్క్ లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి.. మైనస్ 45 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

అమెరికా వ్యాప్తంగా అత్యంత క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. ముఖ్యంగా 14 లక్షల ఇళ్లు, వ్యాపార సంస్థలపై తుపాను ప్రభావం పడింది. న్యూయార్క్ లో అత్యవసర పరిస్థితి విధించారు. తూర్పు ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బలమైన గాలులకు వృక్షాలు, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. డెస్ మోయినెస్, లోవాలో ఉష్ణోగ్రతలు మైనస్ 38 డిగ్రీల సెంటీగ్రేడ్ గా నమోదయ్యాయి. అంటే ఇక్కడి ఉష్ణోగ్రతలో ఐదు నిమిషాలు ఉంటే గడ్డకట్టిపోవడం ఖాయం. నార్త్ కరోలినా, వర్జీనియా, టెనెస్సే ప్రాంతాలపైనా దీని ప్రభావం గణనీయంగా ఉంది. తుపాను కారణంగా 13 మంది మరణించారు. రోడ్లు దెబ్బతిన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. 20 కోట్ల మంది ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. తీరం వెంబడి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement