ఢిల్లిలోని ఇండియా గేట్ వద్ద ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రానైట్‌తో చేసిన నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఘన నివాళి అర్పిస్తామన్నారు. భారతదేశం ఆయనకు రుణపడి ఉంటుందని తెలిపారు. దీనికి చిహ్నంగా ఈ విగ్రహం నిలుస్తుందన్నారు. ఈ మేరకు ప్రధాని తాజాగా టీట్ చేశారు. నేతాజీ విగ్రహాన్ని నిర్మించే వరకు.. ఢిల్లిdలోని ఐకానిక్ స్మారక చిహ్నం వద్ద నేతాజీ విగ్రహం ఉంచుతామని స్పష్టం చేశారు.
జనవరి 23వ తేదీన నేతాజీ జయంతి సందర్భంగా లోగ్రామ్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహం ఎత్తు 28 అడుగుల ఎత్తు.. 6 అడుగుల వెడల్పుతో ఉండనున్నట్టు ప్రభుత వర్గాలు తెలిపాయి. నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఈ ఏడాది నుంచి గణతంత్ర దినోత్సవ వార్షిక వేడుకలు ప్రారంభం అయ్యే తేదీని మార్చారు. జనవరి 24కు బదులు.. 23 నుంచి ప్రారంభం అవుతాయి. నేతాజీ జ్ఞాపకార్థం జనవరి 23ను పరాక్రమ్ దివస్‌గా పాటిస్తామంటూ కేంద్రం గతేడాది ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..