ఒమిక్రాన్ ఆందోళన నేపథ్యంలో అన్ని దేశాలు బూస్టర్ డోస్ వేయడం ఉత్తమం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది. ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, మలేషియా, భారత్‌తో పాటు ఆసియా-పసిఫిక్ దేశాల్లోనూ కేసులు నమోదయ్యాయి. విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియాలో శుక్రవారం ఈ వేరియంట్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ కేసు నమోదైంది. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ఆసియా-పసిఫిక్ దేవాలు తమ ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలి.
ఇందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు సన్నద్ధం అవ్వాలి. పౌరుకుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ ఆందోళనకర వేరియంట్. సరిహద్దు నియంత్రణలు వైరస్ వ్యాప్తిని కొంత ఆలస్యం చేయగలవు. కానీ ప్రతీ దేశం కేసుల పెరుగుదలకు తగ్గట్టు సిద్ధం కావాలి. ప్రస్తుతం కరోనాను ఎదుర్కొనేందుకు పాటిస్తున్న విధానాలు సరిపోతాయి. డెల్టా వేరియంట్ నుంచి నేర్చుకున్న పాఠాలు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. టీకాలు వేయడం, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు అమలు చేయాలి.