Tuesday, November 19, 2024

ఇంటికే బూస్ట‌ర్.. స‌ర్కార్ నిర్ణ‌యం

60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ వేసేందుకు నిర్ణయించిన నేపథ్యంలో కోమోర్బిడిటిస్‌ ఉన్నవారికి, ఇప్పటి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గానీ, వ్యాక్సినేషన్‌ సెంటర్‌ గాని వెళ్లి వ్యాక్సినేషన్‌
వేసుకోనివారు జిహెచ్‌ఎంసి హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే ఇంటికి వచ్చి బూస్టర్‌ డోస్‌ను వేయనున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటిఆర్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు కోమోర్బిడిటిస్‌ ఉన్నవారు వివిధ కారణాల వలన బూస్టర్‌ డోస్‌ వేసుకొనివారు జిహెచ్‌ఎంసిలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 040-21111111 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే సంబంధిత జోన్‌, సర్కిల్‌, వార్డుకు సంబంధించిన బాధ్యులకు తెలియజేసి మొబైల్‌ వాహనం ద్వారా ఇంటికి వచ్చి వాక్సినేషన్‌ వేస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement