Tuesday, November 26, 2024

ఆరునెలలకే ఇక బూస్టర్‌ డోస్‌, కేంద్రం కీలక నిర్ణయం

కరోనా ఫోర్త్‌ వేవ్‌ ముప్పు ముంచుకొస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌, బూస్టర్‌ డోస్‌ మధ్య గ్యాప్‌ను ఆరునెలలకు తగ్గించింది. సెకండ్‌ డోస్‌, బూస్టర్‌ బోస్‌ మధ్య వ్యవధిని తగ్గించాలని వ్యాక్సినేషన్‌పై సలహా మండలి నేషనల్‌ టెక్నికల్‌ అడ్వయిజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (ఎస్‌టీఏజీఔ) సూచించింది.

గతంలో కరోనా వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌కు, బూస్టర్‌ డోస్‌కు మధ్య తొమ్మిది నెలల గ్యాప్‌ ఉండేది. దీన్ని ఇప్పుడు ఆరునెలలు లేదా 26 వారాలకు కుదించారు. 18 నుంచి 59 ఏండ్ల వారికి సెకండ్‌ డోస్‌ తీసుకున్న ఆరునెలలు లేదా 26 వారాల తరువాత ప్రికాషన్‌ డోసు తీసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో బూస్టర్‌ డోస్‌లు అందిస్తారని తెలిపింది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement