Saturday, November 23, 2024

మార్కెట్‌కు బూస్ట్‌, ఎఫ్‌ఐఐ, డీఐఐల అండ.. జీఎస్‌టీ కలెక్షన్ల భరోసా..

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించడం, ముడి చమురు ధరల క్షీణత, ఎఫ్‌ఐఐల, డీఐఐలతో నికర కొనుగోలుదారులతో ఇండియన్‌ సెకండరీ మార్కెట్‌ 2022-23 ఆర్థిక సంవత్సరంలో బలంగా ప్రారంభించింది. మార్చిలో భారత్‌ జీఎస్‌టీ కలెక్షన్లు అదరగొట్టాయి. రూ.1.42 లక్షల కోట్లతో ఆల్‌టైం రికార్డును తాకింది. ఇది దలాల్‌ మార్కెట్‌కు సానుకూలతను అందించాయి. స్టాక్‌ మార్కెట్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వచ్చే వారం ఆర్‌బీఐ మానిటరీ పాలసీ ఉంటుంది. ఆర్‌బీఐ క్రెడిట్‌ పాలసీతో పాటు ఆర్బీఐ-ఉక్రెయిన్‌ వార్తలపై కూడా దృష్టి సారించాల్సి ఉందని అంటున్నారు. క్రూడాయిల్‌ ధరలు తగ్గడం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి సానకూల సాంకేతాలు, ఎఫ్‌ఐఐ కొనుగోళ్లు, డీఐఐ నిరంతర మద్దతు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరాన్ని భారత్‌ సానుకూలంగా ప్రారంభించిందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు పారిశ్రామిక కార్యకలాపాలు కూడా పుంజుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చైనా కరోనాతో పోరాడుతోంది. ఇది సరఫరా చైన్‌పైన, తద్వారా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించొచ్చు. స్టాక్‌ మార్కెట్‌పైన ఆర్‌బీఐ క్రెడిట్‌ పాలసీ, రష్యా ఉక్రెయిన్‌ అంశాలు, ఎఫ్‌ఐఐ, డీఐఐ, గత త్రైమాసికం అలాగే, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీల ఫలితాలు స్టాక్‌ మార్కెట్‌పైన ప్రభావం చూపుతాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement