Saturday, October 5, 2024

IND vs AFG | భారత్ బౌలర్ల విశ్వరూపం.. చిత్తుగా ఓడిన ఆఫ్ఘాన్

టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. సూపర్ 8లో అఫ్గానిస్థాన్‌పై భారత జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆఫ్ఘనిస్థాన్ ముందు 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత డిఫెండింగ్‌లో అఫ్ఘాన్‌ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్.. భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకే పరిమితమైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీశారు. ఇక కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా… అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలకు ఒక్కో వికెట్ దక్కింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement