Saturday, November 23, 2024

హైకోర్టుకెళ్లిన బుక్‌మైషో, ఆన్‌లైన్ టికెట్ విధానంపై అభ్యంత‌రం.. ఈనెల 27కు కేసు వాయిదా..

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న ఆన్‌ లైన్‌ సినిమా టికెట్‌ బుకింగ్‌ విధానంపై బిగ్‌ ట్రీ ఎంటర్‌ టైన్మెంట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ (బుక్‌ మై షో) హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఏపీ ఫిలిం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌ డీసీ) గుత్తాధిపత్యం వహించేలా ఆన్‌ లైన్‌ టికెట్ల విధానాన్ని ప్రభుత్వం రూపొందించిందని బుక్‌ మై షో తరపున న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. దీని వల్ల ఆన్‌ లైన్‌ టికెట్ల బుకింగ్‌ వ్యాపారంలో ఉండే సంస్థలు తీవ్రంగా నష్టపోతాయి..దీనిపై ఇటీ వల ఏర్పాటు చేసిన సమావేశంలో బుక్‌ మై షో ప్రతినిధులు పాల్గొన్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించలేదన్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. డిఫెన్స్‌ వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, డీవీఎస్‌ఎస్‌ సోమయాజుల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయటం సాధ్యం కాదని వెల్లడిస్తూ కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ లకు నోటీ-సులు జారీ చేసింది. విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement