Tuesday, November 26, 2024

కరోనా వ్యాక్సిన్ కోసం బుక్ చేసుకున్నారా?..

కోవిడ్ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కోవిన్ పోర్టల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. కోవిషీల్డ్ రెండో డోసు వ్యవధి పెంపునకు అనుగుణంగా కోవిన్ పోర్టల్ లో మార్పులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిషీల్డ్ మొదటి, రెండవ డోసుల మధ్య సమయాన్ని 42 రోజుల నుంచి 84 రోజులకు పెంచేందుకు కోవిన్ యాప్​లో మార్పులు చేసినట్లు పేర్కొంది.  కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసుకు ఇప్పటికే బుక్ చేసిన షెడ్యూల్ ను లబ్ధిదారులు మార్పులు చేసుకోవాలని సూచించింది. కోవిషీల్డ్ మొదటి డోస్ తీసుకున్నవారు.. రెండో డోస్ తేదీలను నిబంధనలకు లోబడి రీషెడ్యూల్ చేసుకోవాలని కోరింది. 

వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చేసిన సూచనలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు తెలిపింది. కోవిషిల్డ్ రెండో డోసు వ్యవధి పెంపునకు అనుగుణంగా కో-విన్ పోర్టల్ లో మార్పులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసుకు ఇప్పటికే బుక్ చేసిన షెడ్యూల్ ను లబ్ధిదారులు మార్పులు చేసుకోవాలని సూచించింది. 84 రోజుల తర్వాత కోవిషీల్డ్ రెండో డోసు కోసం అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కోవిషిల్డ్ రెండు డోసుల మధ్య పెంచిన వ్యవధిని రాష్ట్రాలు కూడా గుర్తించాలని పేర్కొంది. వ్యాక్సినేషన్ లో జరిగిన మార్పులపై రాష్ట్రాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. 

ఇకపై 84 రోజులు తక్కువ వ్యవధి ఉన్న వారికి ఆన్ లైన్, ఆన్ సైట్​లో వ్యాక్సినేషన్ సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ముందస్తుగా ఆన్ లైన్​లో రిజిస్టర్ చేసుకున్న వారి స్లాట్లు రద్దు కావని చెప్పింది. ప్రైవేట్ కొవిడ్ వాక్సినేషన్ సెంటర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి.. ఈ విషయంపై అవగాహన కల్పించాలని తెలిపింది.

కాగా, కోవిడ్ వర్కింగ్ గ్రూప్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి, రెండో డోసుల మధ్య అంతరాన్ని 12-16 వారాలకు పొడిగించాలని సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా మే 13న అంగీకారం తెలిపింది.

ఇది కూడా చదవండి: కరోనా టీకా వేయించుకుంటున్నారా? ఎలాంటి ఆహారం తినాలి?

Advertisement

తాజా వార్తలు

Advertisement