Saturday, November 23, 2024

రైల్వే ఉద్యోగులకు బోనస్‌.. ఉత్పాదకతతో లింకుపెట్టిన కేంద్రం

రైల్వే ఉద్యోగులకు ఉత్పాదక ఆధారిత (పీఎల్‌బీ) బోనస్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల వేతనానికి సమానమైన మొత్తాన్ని బోనస్‌గా ఇవ్వాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ బుధవారం నాడు చెప్పారు. మొత్తం 11.27 లక్షల మంది నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు ఈ బోనస్‌ ఇవ్వనున్నారు. ఒక ఉద్యోగికి గరిష్టంగా 17,951 రూపాయలు బోనస్‌గా వస్తాయి.

మొత్తం 1,832.09 కోట్లను బోనస్‌గా చెల్లించనున్నారు. బోనస్‌ అందుకునే వారిలే రైల్వేలో పని చేసే ట్రాక్‌ నిర్వహకులు, డ్రైవర్లు, గార్డులు, స్టేషన్‌ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నిషియన్లు, టెక్నిషియన్‌ హెల్పర్స్‌, కంట్రోలర్స్‌, పాయింట్‌మెన్స్‌, మినిస్టీరియల్‌ స్టాప్‌, గ్రూప్‌ సీ సిబ్బంది వంటి వారు ఉన్నారు. ఉత్పాదకత ఆధారిత బోనస్‌ వల్ల ఉద్యోగులు తమ పని విధానాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు తోడ్పడుతుందని మంత్రి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement