హైదరాబాద్, (ప్రభ న్యూస్) : బోన్జోర్ ఇండియా సైన్స్ బియాండ్ బోర్డర్స్ ప్రదర్శనను బీఎం బిర్లా సైన్స్ సెంటర్ వద్ద 3 నుంచి ఉదయం 11 గంటలకు తెరువనున్నారు. ఈ ప్రదర్శనలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. ఇది జూన్ 26 ఉదయం 10.30 నుంచి రాత్రి 8 గంటల వరకూ బీఎం బిర్లా సైన్స్ సెంటర్ వద్ద (సోమవారాలు మినహా) తెరిచి ఉంటుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం (ఐ అండ్ సీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖల ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, బెంగళూరులోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఫ్రాన్స్ థియర్రీ బెర్తెలాట్, బీఎం బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ కె జి కుమార్ పాల్గొననున్నారు.
పద్మశ్రీ జ్ఞాన గాంధీ వాసుదేవన్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పాల్గొనను న్నారు. అలయన్స్ ఫ్రాన్సిస్ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ బెర్థీట్ మాట్లాడుతూ… భారతదేశం అత్యంత వేగంగా మహోన్నత శక్తి హోదాను సంతరించుకుంటుందన్నారు. భారతీయ శాస్త్రవేత్తల మహోన్నత ఆవిష్కరణలు దీనికి మరింత తోడ్పాటుంనందిస్తున్నాయన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..