Friday, November 22, 2024

స్వరాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాలు : మంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ : స్వరాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాలు పండుగ‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని ఉప్పుగూడలో రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నాలుగు మల్టీప‌ర్ప‌స్ ఫంక్ష‌న్ హాల్స్ నిర్మాణ పనుల‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ.. లాల్ ద‌ర్వాజ సింహ వాహిణి ఆలయాన్ని రూ.10 కోట్ల వ్య‌యంతో అభివృద్ధి చేస్తామ‌న్నారు. సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యంత ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుతున్నామ‌న్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. ప్రజల మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి త‌ల‌సాని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement