తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో ఆదివారంనాడు బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఎర్నాకుళంలో జిల్లాలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ లో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ పేలుడు చోటు చేసుకుంది. వరుసగా మూడు దఫాలు ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
యెహూవా సాక్షి సమావేశంలో మూడు దఫాలు బాంబు పేలుళ్లు జరిగినట్టుగా సమాచారం.యెహూవా సాక్షి సమావేశం పేరుతో శుక్రవారం నుండి ఆదివారం వరకు సమావేశాలు నిర్వహిస్తారు.ఈ సమావేశాలు జరిగే ప్రాంతంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ఉగ్రదాడిగా కూడ పోలీసులు అనుమానిస్తున్నారు.
పేలుళ్లు జరిగిన సమయంలో ఈ కన్వెన్షన్ సెంటర్ లో 2 వేల మంది ఉన్నారు. ఈ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన మూడు పేలుళ్లతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుళ్లపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.