ఫ్రెండ్ బర్త్‌డే సందర్భంగా జరిగిన డ్రగ్ పార్టీపై దాడుల్లో పట్టుబడ్డ ఇద్దరు యువకులకు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. రాబోయే పరిణామాలను గమనించకుండా యువత విచ్చలవిడిగా ప్రవర్తిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. నాసిక్‌లోని ఇగత్‌పురిలో ఓ విల్లాలో జరిగిన డ్రగ్ పార్టీని పోలీసులు భగ్నం చేసి పలువురిని అరెస్ట్ చేశారు.
బర్త్‌డే పార్టీలో వీరు గంజాయి, కొకైన్‌ను సేవిస్తూ మాదకద్రవ్యాలతో పట్టుబడ్డారు. యువతలో డ్రగ్స్, మద్యపానం సహజంగా మారిన క్రమంలో వీరిలో మార్పు ఆశించేందుకు ఓ అవకాశం ఇవ్వాలని జస్టిస్ భారతి హెచ్ డాంగ్రే నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. మరోసారి డ్రగ్స్‌తో పట్టుబడితే బెయిల్ రద్దు చేస్తామని కోర్టు నిందితులను హెచ్చరించింది. యువతలో డ్రగ్స్ వాడకాన్ని నివారించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముంబై హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ వార్త కూడా చదవండి: మలాలా యూసెఫ్‌జాయ్‌పై తాలిబన్ల దాడికి 9 ఏళ్లు