తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. పట్టణంలోని పలు స్కూళ్లకు కొందరు ఆగంతకులు బాంబులు ఉన్నాయంటూ ఈ మెయిల్స్ సెండ్ చేశారు. ముఖ్యంగా జేజే నగర్, ఆర్ఏ పురం, అన్నానగర్, గోపాలపురంలోని పలు ప్రైవేటు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ అందాయి.
దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను వారివారి ఇళ్లకు పంపేశారు. అనంతరం బాంబు స్వ్కాడ్ కు సమాచారం అందజేయగా, వారు రంగంలోకి దిగి ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠాశాలల యాజమాన్యాలు ఒక్కసారిగా ఊపరి పీల్చుకున్నారు.