Wednesday, November 20, 2024

Ayodhya | రామమందిరానికి బాంబు బెదిరిపులు.. అయోధ్యలో హై అలర్ట్

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. అవన్నీ బూటకపు బెదిరింపులని తేలినా.. బాంబు బెదిరింపులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, తాజాగా అమోధ్య రామమందిరాన్ని పేల్చివేస్తామని జైష-ఎ-మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ బెదిరించింది. ఈ మేరకు బెదిరింపు ఆడియో విడుదలైంది. దీంతో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు.

మహర్షి వాల్మీకి విమానాశ్రయంతో సహా అయోధ్యలోని ప్రధాన ప్రదేశాలతో పాటు ఇతర ప్రధాన ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో భారీగా బద్ర‌త‌ను పెంచారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజ్ కరణ్ నయ్యర్ స్వయంగా వాల్మీకి విమానాశ్రయానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే రామమందిరం చుట్టూ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అయోధ్యను వేర్వేరు జోన్లుగా విభజించి, వాటి ప్రకారం భద్రతా సిబ్బందిని నియమించామని చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మసీదును తొలగించి ఆ స్థలంలో గుడి కట్టినట్లు అమీర్ అనే ఉగ్రవాది ఆడియోలో చెబుతున్నాడు. ఇప్పుడు ఈ ఆలయాన్ని కూల్చివేయాల్సి ఉంద‌ని.. బాంబులు అమర్చబోతున్నట్లు ఆడియో టేపు ఉన్నట్టు తెలిపారు. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement