కర్నాటక రాజధాని బెంగళూరు శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని పలు పాఠశాలల్లో బాంబులు పెట్టినట్టు ఒకేసారి బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగరంలోని ఏడు పాఠశాలలకు ఒకేసారి బెదిరింపులు వచ్చాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో బెంగళూరులోని ఏడు ప్రముఖ పాఠశాలలకు వేరేరు ఈ-మెయిల్ ఐడీల నుంచి మెయిల్స్ వెళ్లాయి. స్కూల్స్‌లో బాంబులు పెట్టామని, దీన్ని జోక్‌గా తీసుకోవద్దంటూ హెచ్చరించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవాలంటూ మెయిల్ చేశారు. ఇప్పుడుంతా మీ చేతుల్లోనే ఉందంటూ మెయిల్లో ఉంది. మెయిల్ వచ్చిన సమయంలో ఆయా పాఠశాలల్లో పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులను బయటికి పంపిన పోలీసులు.. తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి బాంబులు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈమెయిల్స్‌పై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
బెంగళూరులో 7 స్కూల్స్ కు బాంబు బెదిరింపులు.. పాఠశాలలకు ఈ-మెయిల్స్
Advertisement
తాజా వార్తలు
Advertisement