Sunday, November 17, 2024

స్పైస్‌జెట్‌ ఎయిర్‌వేస్‌కు బాంబు బెదరింపు… బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ ట్రయినీ అరెస్టు0

స్పైస్‌జెట్‌ విమానానికి బూటకపు బాంబు కాల్‌ చేసిన ఘటనలో బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ట్రైనీ టికెటింగ్‌ ఏజెంట్‌ని అరెస్టు చేశారు. బాంబు ఉన్నట్టు అందిన కాల్‌తో విమానం బయలుదేరటాన్ని నిలిపివేసి క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. అయితే విమానంలో ఎలాంటి అనుమాస్పద వస్తువును కనుగొనలేదని అధికారులు తెలిపారు. దీంతో ఇది బూటకపు కాల్‌ అని నిర్ధారించినట్టు స్పైస్‌జెట్‌ ప్రతినిధి వెల్లడించారు. కాల్‌ చేసిన అంగతకుడిని గుర్తించేందుకు ఢిల్లి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాయి. బూటకపు కాల్‌ చేసింది 24 ఏళ్ల అభినవ్‌ ప్రకాష్‌ అని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు తన చిన్ననాటి స్నేహితులు, తమ గాళ్‌ఫ్రెండ్స్‌తో మరికొంత సమయం గడపాలనుకుంటున్నారని అందుకే విమానంలో బాంబు ఉందని తాను కాల్‌ చేసినట్టు నిందితుడు అభినవ్‌ తెలిపాడు.

ఈ ఘటన ముగ్గురూ భాగస్వాములని పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లి-పూనా స్పైస్‌జెట్‌ విమానం గురవారం సాయంత్రం ఐజీఐ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉంది. టేకాఫ్‌కు కొన్ని నిమాషాల ముందు విమానంలో బాంబు ఉందని స్సైట్‌జెట్‌ రిజర్వేషన్‌ కార్యాలయానికి కాల్‌ వచ్చింది. ఆ సమయంలో విమానంలో ప్రయాణికుల బోర్డింగ్‌ ప్రారంభం కాలేదని ఎయిర్‌లైన్‌ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. కాల్‌ వచ్చిన వెంటనే విమానాన్ని ఐసోలేషన్‌ బేకు తరలించిన భద్రతా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement