Friday, October 18, 2024

Bomb Threat – న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపు…

ఎయిరిండియా విమానంలో బాంబు ఉందని బెదిరింపు సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముంబై నుంచి న్యూయార్క్‌కు వెళ్లే ఎయిరిండియా ఇండియా విమానాన్ని వెంటనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు. అప్పటికే అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు అవసరమైన భద్రతా చర్యలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు సమాచారం అందింది. అప్పటికే విమానం టేకాఫ్‌ అవ్వడంతో పైలట్‌కు సమాచారం అందించి వెంటనే విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌(ఐజీఐ)కు మళ్లించాం. అప్పటికే ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్‌ సదుపాయాలు ఏర్పాటు చేశాం. విమానం ఎయిర్‌పోర్ట్‌ చేరిన వెంటనే ప్యాసింజర్లను సురక్షితంగా వేరేచోటుకు చేరవేశాం. భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విమానం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ బాంబు బెదిరింపు సమాచారం ఎవరు పంపారు..ఎక్కడి నుంచి తమకు సమాచారం వచ్చిందో మాత్రం ఇంకా తెలియరాలేదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement