Thursday, December 12, 2024

Bomb Threat – 40 పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్

న్యూ ఢిల్లీ – దేశ రాజధాని ఢిల్లీలోని 40 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపు మెయిల్ రావడంతో పాఠశాలలు పిల్లలను బయటకు పంపించారు. పాఠశాలల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించాయి.

ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు దాడుల బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు మెయిల్ ద్వారా వచ్చాయి. పశ్చిమ్‌ విహార్‌లోని డీపీఎస్‌ ఆర్‌కే పురం, జీడీ గోయెంకా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో విద్యార్థులకు ఇళ్లకు పంపించారు. పాఠశాలల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

- Advertisement -

ఉదయం 7 గంటలకు బాంబు బెదిరింపు సమాచారం అందింది. ఈ సమయానికి పిల్లలు పాఠశాలకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలాలకు చేరుకున్నారు.

ఈ ఏడాది పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాల్లో బాంబుల గురించి తప్పుడు సందేశాలు వచ్చాయి. చాలా సందర్భాలలో, ఈ బెదిరింపు మెయిల్‌లు లేదా ఫోన్ కాల్‌లు అబద్ధమని తేలింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ ఏడాది మే నెలలో కనీసం 60 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ దీనిపై ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించడంతో ఢిల్లీ పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి.

అయితే, దర్యాప్తులో బాంబులు లేదా పిల్లల భద్రతకు ఎటువంటి ముప్పు లేదని తేలింది. తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీలోని పాఠశాలలకు ఈ మెయిల్స్ అందాయి. ఈ ఏడాది విమానాల్లో బాంబుల గురించి ఫేక్ కాల్స్ ఎన్నో వచ్చాయి. వీటి కారణంగా విమానాల రాకపోకలు దెబ్బతిన్నాయి. విమానయాన సంస్థ నష్టాలను చవిచూసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement