ఢిల్లీ హైకోర్టుకు బాంబుల బెదింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులను ఈ- మెయిల్ ద్వారా పంపారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు న్యాయస్థానం దగ్గర కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు.
ఇక, ఢిల్లీ హైకోర్టులో భారీ బాంబు పేలుడు సంభవిస్తుందని కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ మెయిల్ ఈ మెస్సేజ్ వచ్చింది. నేడు హైకోర్టులో బాంబు పేల్చుతానంటూ వచ్చిన ఈ- మొయిల్ పేలుడు ఢిల్లీలోనే అతిపెద్దది కానుంది అని అందులో పేర్కొన్నారు. అయితే, ఎంత మంది భద్రతా బలగాలైనా పెట్టుకోండి.. అందరినీ పేల్చివేస్తాం అంటూ గుర్తు తెలియని దుండగులు ఈ మెయిల్‌లో బెదిరింపులకు దిగారు.
ఇక, ఇదే రోజు మరోవైపు బీహార్ డీజీపీకి సైతం వాట్సప్ లో ఆడియో క్లిప్ ద్వారా బాంబు బెదిరింపు పంపడం గమనార్హం. అయితే, ఈ ఘటనలో నిందితుడిని కర్ణాటకలో పటుకున్నామని పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి అతణ్ని ఎంక్వైరీ కోసం పట్నాకు తరలించారు. నిందితుడిని అన్ని కోణాల్లో లోతుగా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.