బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు ఫేక్ కాల్ చేసిన ఒక వ్యక్తిని కొన్ని గంటల తర్వాత బెంగళూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరులోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఒక వ్యక్తి నుండి కాల్ వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 3.50 గంటలకు విమానాశ్రయంలో టైమ్‌బాంబ్ పేలుతుందని కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. దీంతో విమానాశ్రయంలో ఉన్న పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తమయ్యారు.
దీని తర్వాత బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు విమానాశ్రయంలో సోదాలు నిర్వహించారు. అయితే ఉదయం 7 గంటలకు, అది ఫేక్ కాల్ అని గుర్తించారు అధికారులు కాల్ చేసిన వ్యక్తిని సుభాశిష్ గుప్తాగా గుర్తించారు పోలీసులు. తన బావపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా చేశాడని పోలీసులు తెలిపారు. తన సోదరికి విడాకులు ఇచ్చినందుకు అతడిపై ప్రతీకారంతో తన బావగారి పేరుతో ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..