Wednesday, November 20, 2024

Bomb Cyclone – అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న బాంబ్‌ సైక్లోన్‌ – కాలిఫోర్నియాతో సహా మూడు రాష్ట్రాలకు భారీ వరద ముప్పు

కాలిఫోర్నియాతో సహా మూడు రాష్ట్రాలకు భారీ వరద ముప్పు
శ‌క్తివంత‌మైన సైక్లోన్ తో ఏకంగా 8 ట్రిలియన్‌ గ్యాలన్ల వర్షం
క‌నివీని ఎరుగ‌ని రీతిలో జ‌ల‌ప్ర‌ళ‌యం
అప్ర‌మత్తంగా ఉండాలంటూ ప్ర‌జ‌ల‌కు హెచ్చ‌రిక‌లు

కాలిఫోర్నియా – అమెరికాకు ‘బాంబ్‌ సైక్లోన్‌’ ముప్పు పొంచి ఉంది. ముంచుకొస్తున్న తీవ్ర తుఫానుతో అనేక రాష్ర్టాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. బాంబ్ తుఫాన్ అగ్ర రాజ్యం అమెరికాను హడలెత్తిస్తోంది. అత్యంత శక్తివంతమైన సైక్లోన్ అనేక రాష్ట్రాలపై ప్రభావం చూపించనుంది . తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు కారణంగా తీవ్ర ప్రళయం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో భారీ విలయం సృష్టించే అవకాశాలున్నాయని సమాచారం. కాలిఫోర్నియా సహా ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సుమారు 8 ట్రిలియన్‌ గ్యాలన్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటల వ్యవధిలోనే గణనీయంగా బలపడే తుఫానును ‘బాంబ్‌ సైక్లోన్‌’ అని పిలుస్తారు. తుఫాను తీరం చేరే సమయంలో హారికేన్‌ స్థాయిలో భీకర గాలులు వీస్తాయని, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, పర్వత ప్రాంతాల్లో మంచు పడొచ్చని వాతావరణ శాఖ సూచించింది.

దీని ప్రభావంతో కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది ట్రిలియన్ గ్యాలన్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా తుపాను ప్రభావంపై అంచనా వేయడానికి ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది కాలిఫోర్నియా యూనివర్సిటీ . వరద ముప్పు ఉన్న ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. కేటగిరి 4 పరిస్థితులు ఎదురుకానున్నాయని, దీని ప్రభావంతో దక్షిణ ఓరెగన్, ఉత్తర కాలిఫోర్నియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వరద ముప్పు ఉన్న ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కూడా సూచించారు. నేటి నుంచి 72 గంటల పాటు రాష్ట్రంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ లు ప్ర‌జ‌ల‌ను కోరారు

- Advertisement -

బాంబ్‌ సైక్లోన్‌ అంటే..?

”బాంబ్ సైక్లోన్” అనే పదాన్ని వాతావరణ శాస్త్రజ్ఞులు 1980లలో స్థాపించారు. వెచ్చని, తేమతో కూడిన ఉష్ణమండల గాలి కారణంగా ఈ తుఫాన్ బలపడుతుంది. బాంబ్‌ సైక్లోన్‌ అనే పదం బాంబోజెనిసిస్‌ నుంచి వచ్చింది. గంటల వ్యవధిలోనే తుఫాను బలపడే పరిణామాన్ని బాంబ్‌ సైక్లోన్‌గా పిలుస్తారు. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో కనీసం 24 మిల్లీబార్లు అంతకంటే ఎక్కువ మేర వాతావరణ పీడనం పడిపోవడాన్ని ఈ తరహా సైక్లోన్‌గా పరిగణిస్తారు. హరికేన్‌ స్థాయిలో గాలులు వీయడంతో పాటు భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. కాగా ఈ బాంబ్ సైక్లోన్ మంగళవారం-గురువారం మధ్య సమీపించే తుఫాను 24 గంటల్లో 50 నుంచి 60 మిల్లీబార్‌ల వరకు పీడనం తగ్గుతుందని సూచించారు. సోమవారం రాత్రి 1000 మిల్లీబార్లకుపైగా ప్రారంభమైన ఈ పీడనం మంగళవారం రాత్రికి 950 మిల్లీబార్లకు దిగువకు పడిపోయింది. మ‌రింత ప‌డిపోవ‌డ‌తో ఏకంగా 8 ట్రిలియన్‌ గ్యాలన్ల వ‌ర్షం ఏక‌దాటిగా ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement