ఇస్లామాబాద్: దాయాది దేశమైన పాకిస్థాన్ లో ఎన్నికలకు ఒక రోజు ముందు జంట పేలుళ్లతో దద్దరిల్లింది. బలూచిస్థాన్‌లో ఇవాళ జరిగిన ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఎన్నికల్లో పోటీ పడుతోన్న అభ్యర్థుల కార్యాలయాల వద్ద ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనలో మరో 24 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రేపు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇవాళ జరిగిన ఈ బాంబు పేలుళ్లతో ఆప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.