Thursday, November 14, 2024

Pakistan | రైల్లో బాంబు పేలుడు.. 20మంది దుర్మరణం

పాకిస్థాన్ క్వెట్టా రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు..
20 మంది దుర్మ‌ర‌ణం…
30 మందికి పైగా గాయాలు
మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం

పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 20 మంది మృతి చెందగా, మ‌రో 30 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం. క్షతగాత్రులందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఘటనా స్థలానికి బాంబు నిర్వీర్య దళాన్ని కూడా రప్పించారు.

రైల్వే అధికారుల స‌మాచారం ప్రకారం, శనివారం ఉదయం 9:00 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెషావర్‌ వెళ్లాల్సిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం ప్రయాణీకులు ప్లాట్‌ఫారమ్‌పై వేచి చూస్తుండగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి శరీర భాగాలు ముక్కలయ్యాయి. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మొత్తం రెండు సార్లు పేలుళ్లు సంభ‌వించాయి. ఒక పేలుడులో నలుగురు మరణించగా, రెండో పేలుడులో దాదాపు 16 మంది మ‌ర‌ణించారు.

పేలుడు జరిగిన సమయంలో రైలు ప్లాట్‌ఫారమ్‌పై లేదు. బుకింగ్ కార్యాలయం లక్ష్యంగా ఈ పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ బాంబు పేలుడు ఎవరు, ఎందుకు చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement