అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లో మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. కాబూల్‌లోని అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ వీధిలో శక్తిమంతమైన బాంబు పేలింది. దీంతో ఎనిమిది మంది మరణించగా 22 మంది గాయపడ్డారు. దేశంలో మైనార్టీలైన షీయెట్ ముస్లిం కమ్యూనిటీకి చెందినవారు కలుసుకునే ప్రాంతంలో బాంబు పేలిందని అధికారులు వెల్లడించారు. ఈ బాంబు దాడికి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు చెందిన సున్ని ముస్లిం గ్రూప్ బాధ్యతవహిస్తూ ప్రకటన చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement