దేశ రాజధానిలో ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కలకలం రేపుతోంది. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని పీవీఆర్ సినిమా హాల్ దగ్గర ఇవాళ భారీ పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అదేవిధంగా ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కూడా పరిస్థితిని సమీక్షిస్తోంది.
అదే ప్రాతంలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే బాంబు పేలడం పలు అనుమానాలకు తావిస్తోంది. సరిగ్గా నెల రోజుల క్రితం ప్రశాంత్ విహార్‌లోని సీఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో పేలుడు సంభవించిన తరువాత నేడు మళ్లీ అదే ప్రాంతంలో పేలుడు జరగడంతో అసలు ఏం జరుగుతోందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
- Advertisement -