కరాచీ: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. కరాచీ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ భారీ పేలుడులో ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడినట్లు సమాచారం. . ఇకపోతే ., ఆదివారం రాత్రి 11 గంటలకు కరాచీ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడును పాకిస్థాన్ ఉగ్రవాద దాడిగా పేర్కొంది. పాక్ మీడియా ప్రకారం, ఈ దాడికి పాకిస్తాన్ వేర్పాటువాద ఉగ్రవాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించింది. విమానాశ్రయం వెలుపల ట్యాంకర్‌లో ఈ పేలుడు సంభవించింది. అలాగే, విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని ప్రావిన్షియల్ హోం మంత్రి జియా ఉల్ హసన్ తెలిపారు.
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఈస్ట్ అజ్ఫర్ మహేసర్ మీడియాతో మాట్లాడుతూ తాము పేలుడుకు గల కారణాన్ని తెలుసుకునే పనిలో ఉన్నామన్నారు. గాయపడిన వారిలో పోలీసు అధికారులు కూడా ఉన్నారని తెలిపారు. ఎయిర్‌పోర్టు భవనాలు కంపించేంత పెద్ద పేలుడు సంభవించిందని పౌర విమానయాన శాఖలో పనిచేస్తున్న అధికారి రాహత్ హుస్సేన్ తెలిపారు.
ఇక, ఈ దాడిపై క్షుణ్ణంగా విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలని చైనా రాయబార కార్యాలయం పాకిస్థాన్‌ను కోరింది. పాకిస్తాన్ తన దేశంలో ఉన్న చైనీస్ పౌరులు, సంస్థలు, ప్రాజెక్ట్‌లను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఎంబసీ తెలిపింది. ఈ దాడి పరిణామాలను కనుగొనగడానికి మేము పాకిస్తాన్‌తో కలిసి సాధ్యమైన సహాయం చేస్తామని తెలిపింది.