పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఇవాళ పోలియో టీకాలు వేసే కార్మికులకు భద్రత కల్పించేందుకు వెళ్లిన పోలీసులను లక్ష్యంగా చేసుకుని బాంబులు పేల్చారు ఉగ్రవాదులు .. ఈ పేలుడులో ఆరుగురు పోలీసులు మృతి చెందారు.. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రావిన్స్లోని బజౌర్ జిల్లాలోని మాముంద్ తహసీల్లో చోటు చేసుకుంది.
ఈ పేలుడు సంభవించినప్పుడు పోలీసులు పోలియో టీకా బృందాలతో భద్రతా విధుల్లో చేరడానికి వ్యాను ఎక్కారు.. ఆ వెంటనే దానికిపైకి బాంబులు విసిరారు.. దీంతో ఒక్కసారిగా వ్యాన్ ముక్కలై మంటలు ఎగిసిపడ్డాయి. కాగా, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.. అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించారు.