Thursday, November 21, 2024

రష్యా ఎంబసీపై బాంబుదాడి.. ఇద్దరు సిబ్బంది మృతి, 11 మందికి గాయాలు

సోమవారం ఉదయం ఆఫ్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో బాంబుదాడి జరిగింది. ఈ దుర్ఘటనలో రష్యన్‌ ఎంబసీకి చెందిన ఇద్దరు సిబ్బంది మరణించారు. వీరి మరణాన్ని రష్యా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో ధృవీకరించింది. వారి నివేదికల ప్రకారం ఆత్మాహుతి బాంబర్‌ ఈ చర్యకు పాల్పడ్డాడని, ఈ ఆత్మాహుతి దాడిలో మరో దౌత్యవేత్త, ఎంబసీ సెక్యూరిటీ గార్డు గాయపడ్డారని, మరో 11మంది గాయపడ్డారని తెలియజేసింది.

రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, కాబూల్‌ కాలమానం ప్రకారం ఉదయం 10.50 గంటలకు రాయబార కార్యాలయం కాన్సులర్‌ విభాగ ప్రవేశ ద్వారం దగ్గర ఒక గుర్తు తెలియని మిలిటెంట్‌ పేలుడు పరికరాన్ని అమర్చాడు. అతను తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందే ఆ వ్యక్తిని గుర్తించి రష్యా రాయబార కార్యాలయం (తాలిబాన్‌) గార్డులు కాల్చి చంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement