జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా వాకయామా నగరంలో ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. దీంతో ఆయనను వెంటనే అక్కడి నుంచి తరలించారు. జపాన్ మీడియా నివేదికల ప్రకారం.. ప్రధాని ఫుమియో కిషిడా ప్రసంగిస్తున్న సమయంలో పేలుడు జరిగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను అక్కడి నుండి బయటకు తీసుకెళ్లారు. అయితే అక్కడ స్మోక్ బాంబ్ విసిరినట్టుగా మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే సంఘటనా స్థలంలో గాయాలు లేదా నష్టం జరిగినట్లు సంకేతాలు లేవు. అయితే స్థానిక అధికారులు ఈ ఘటనపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు
Advertisement
తాజా వార్తలు
Advertisement