బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్..రణ్ బీర్ కపూర్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్రం .సెప్టెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ విడుదల కావడం.. సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. త్వరలో విడుదలయ్యే ఈ మూవీ ప్రమోషన్ల జోరును పెంచేశారు. ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న అలియా.. బ్రహ్మస్త్ర ప్రమోషన్లకు వీలైనంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ప్రమోషన్ లో .. ఆమె ధరించిన డ్రెస్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. బేబీ పింక్ ను కాస్తంగా కనిపించేలా ఉన్న ఈ డ్రెస్ రోటీన్ కు పూర్తి భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఉల్లిపొర లాంటి పింక్ కలర్ డ్రెస్సతో స్పెషల్ అట్రాక్షన్ గా మారిందని చెప్పాలి. గూచీ బ్రాండ్ కు చెందిన పింక్ కలర్ డ్రెస్సు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఈ డ్రెస్ లో అలియా వెలిగిపోయిన తీరుకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.ఉల్లి పొర లాంటి పింక్ డ్రెస్ రేటు.. జస్ట్ 4100 డాలర్లు మాత్రమేనట. మన రూపాయిల్లో చెప్పాలంటే అక్షరాల రూ.3,27,883గా చెబుతున్నారు. ఇంత ఖరీదైన డ్రెస్ ను మూవీ ప్రమోషన్ వేళ ధరించటం ఆమె అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తోంది. ఒక్క డ్రెస్ కోసం అలియా అంత ఖర్చు పెట్టిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement