తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఇన్ స్టా గ్రామ్ ద్వారా ప్రకటించింది బాలీవుడ్ బ్యూటీ బిపాషా. తన భర్తతో కలిసి బేబీ బంప్ తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఈ ఫోటోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘ఒక కొత్త సమయం, ఒక కొత్త ఫేజ్, ఒక కొత్త కాంతి… ప్రిజం లాంటి మా జీవితంలో మరో షేడ్ ను తీసుకొచ్చాయి. మేమిద్దరం ఎవరికి వారు వేర్వేరుగా జీవితాలను ప్రారంభించాం. ఆ తర్వాత ఇద్దరం కలుసుకున్నాం. అప్పటి నుంచి ఒక్కొక్కరిగా ఉన్న మేం ఇద్దరమయ్యాం. ఇద్దరికే ఇంత ఎక్కువ ప్రేమ అవసరమా అనిపించింది. అందుకే ఇద్దరిగా ఉన్న మేం ముగ్గురం అవుతున్నాం. మా ప్రేమకు ప్రతిరూపంగా మాకు మా బిడ్డ జాయిన్ కాబోతోంది. మీ అందరి ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు అని బిపాషా ఇన్స్టాలో స్పందించింది. 2015లో ‘అలోన్’ సినిమా సందర్భంగా బిపాషా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ఇద్దరూ కలిశారు. సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2016 ఏప్రిల్ లో వీరిద్దరూ బెంగాలీ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement