రైలు ప్రయాణిస్తుండగానే రైలు నుంచి రెండు బోగీలు విడిపోయాయి. ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో ప్రయాణికులతోపాటు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి రెండు బోగీలు విడిపోయాయి. గుర్తించిన లోకోపైలట్ రైలును తర్వాతి స్టేషన్‌లో ఆపాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ బోగీలు పట్టాలపై నిలిచిపోయాయి. ఎస్7, ఎస్8 కోచ్‌లు రైలు నుంచి విడిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మళ్లీ రెండు బోగీలను రైలుకు కలిపారు. కప్లింగ్ పిన్ ఊడిపోవడంతోనే బోగీలు రైలు నుంచి విడిపోయాయని అధికారులు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement