Monday, November 18, 2024

ఫ్రీజర్‌ రైళ్లలో రష్యా సైనికుల మృతదేహాలు..

యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రష్యా సైనికుల మృతదేహాలను శీతల రైళ్లలో ఉక్రెయిన్‌ భద్రపరుస్తోంది. యుద్ధం ముగిసిన అనంతరం ప్రత్యర్థి దేశానికి అప్పగించేలా ఏర్పాట్లు చేస్తోంది. కీవ్‌, చెర్నీవ్‌ ప్రాంతాల్లో దాడి చేసిన సమయంలో రష్యా పెద్దఎత్తున సైనికులను కోల్పోయింది. ఇప్పుడు ఆ రెండు రీజియన్లనుంచి తీసుకొచ్చిన రష్యా సైనికుల మృతదేహాలను ఫ్రీజర్‌ రైళ్లలో భద్రపరుస్తున్నారు

ఒక్కో రైలులో వందలకొద్దీ సైనికుల మృతదేహాలు పెట్టామని ఉక్రెయిన్‌ పౌర-సైనిక సహాయక విభాగం అధిపతి వ్లోదిమిర్‌ లియామ్‌జిన్‌ వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రష్యా సైనికుల మృతదేహాలను భద్రంగా ఉంచి వారికి యుద్ధం ముగిసిన వెంటనే అప్పగిస్తామని ఆయన వెల్లడించారు. అతిత్వరలోనే పుతిన్‌ అనారోగ్యంతో తనువు చాలిస్తారని, కానీ రష్యా అన్నివిధాలా భ్రష్టుపట్టినట్టేనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement