విశాఖపట్నం – ప్రతి ఒక్కరిలోనూ ఏదో తెలియని ప్రతిభ ఉంటుంది..అది ఉన్నవిషయం వాళ్లకు కూడా తెలీదు.. తెలుసుకునే సమయం సందర్భాలు అనుకోకుండా వచ్చేస్తుంటాయి.. అవి వచ్చిన రోజున అబ్బో మనలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోవడం కూడా జరిగిపోతుంది.. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. అతడో పడవ నడుపుకునే తాత..జీవితం అంతా నదిలో పడవ నడుపుతూ జీవనం సాగించడమే అతని ప్రధాన వృత్తి.. ఈ పడవ ప్రయాణంలో అనుకోకుండా త్వరలో పెళ్లి చేసుకోబోయే జంట ఎక్కింది.. ఈ జంటకు తమ పెళ్లి షూట్ ఎప్పటికీ జ్ఞాపకం ఉండేలా చేసుకోవాలనేది వారి తపన.. జంట ప్రీ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఢిపరెంట్‌గా ఉండేందుకు మంచి మంచి లోకేషన్లు, నదులు, సముద్రం.. కొండలు, అందమైన పార్కులు అన్ని చూసేశారు.. అన్ని కూడా రొటిన్ గా కనిపించాయి…. ఆ జంట కాస్త ఢిపరెంట్‌గా నాటు పడవలో ఓ నదిలో ఫొటోలు దిగాలనుకున్నారు.. ఇక్కడే వాళ్లకు వింత అనుభవం ఎదురైంది..
నాటు పడవ నడిపిన తాత ఏకంగా వాళ్ల ఫోటో షూట్ కి దర్శకుడిగా మారాడు.. అమ్మాయి, అబ్బాయి ఫొటో ఎలా దిగాలి.. ఎలాంటి ఫోజులు ఇవ్వాలి.. ఇలా నిలిచోండి.. అలా చేయి పట్టుకోండి.. చేతి ఇలా పెట్టు, కాలు ఇలా పెట్టు, అమ్మాయిని ఇలా పట్టుకో, ఇద్దరూ అటు చూసి ఫోజు ఇవ్వండి.. నువ్వు చేయి పైకి ఎత్తు.. అమ్మాయి.. ఆ చేయి పట్టుకుని చుట్టూ తిరుగుతుంది.. అంటూ సూచనలు ఇస్తూ, ఇలా.. తనలోని అవతార్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ ని బయటకు బయటకు తీశాడు. ఉత్తరాంద్ర యాసలో ఆయన మాటలు వింటుంటే.. నవ్వకుండా ఉండలేరు.. ఎంతటివారైనా పొట్ట చెక్కలయ్యేలా నవ్వితీరాల్సిందే.. ఇక, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది. ఆ వీడియోను షేర్ చేస్తూ టిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.. తాతయ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. పడవ నడిపే తాతే ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‍లా కన్పిస్తున్నాడని కొందరు కామెంట్ పెడితే.. తాతయ్య టాలెంట్ సూపర్ అంటూ మరికొందరు.. తాతకి అవకాశం ఇవ్వాలే గానీ.. మంచి రొమాంటిక్ మూవీ కూడా తీసేలా ఉన్నాడు అంటూ ఇంకా కొందరు కామెంట్ పెడుతున్నారు.. జేమ్స్ కేమరూన్ మన దగ్గరే ఉన్నాడంటూ ప్రశంసిస్తున్నారు.