మరో వంద మంది గల్లంతు
కాంగోలోని కివు సరస్సులో ఘటన
కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలోని తూర్పు ప్రాంతంలోని కివు సరస్సులో గత రాత్రి వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడడంతో 78మంది మరణించారు. మరో వంద మందికి పైగా గల్లంతయ్యారు. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా నుండి ఉత్తర కివు ప్రావిన్స్‌లోని గోమాకు పడవ ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
సామర్థ్యం కంటే ఎక్కువ మంది ఎక్కడంతో..
ప్రమాద సమయంలో బోటులో 278మంది ప్రయాణికులున్నారు. దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్-జాక్వెస్ పురుస్సీ ప్రమాదంపై మాట్లాడుతూ… ఘటనలో 78మంది మరణించారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అంతకుముందు, బోటులో దాని సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.