Wednesday, December 18, 2024

Mumbai తీరంలో పడవ ప్రమాదం… కొన‌సాగుతున్న రెస్క్యూ ఆప‌రేష‌న్ !

ముంబై తీరంలో పడవ ప్రమాదం జరిగింది. 80 మందికి పైగా ప్రయాణిస్తున్న ఓ పర్యాటక ఫెర్రీని.. స్పీడ్‌బోట్ ఢీకొట్టింది. దీంతో ఫెర్రీ బోల్తా పడడంతో ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. కోస్ట్ గార్డ్ బోట్, 11 నేవీ బోట్లు, 3 మెరైన్ పోలీస్ బోట్లను సహాయక చర్యల కోసం మోహరించారు.

ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 66 మందిని రక్షించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరో డజను మంది కోసం గాలింపు చ‌ర్య‌లు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ముంబైకి సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎలిఫెంటా దీవులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement