ముంబై తీరంలో పడవ ప్రమాదం జరిగింది. ఓ పర్యాటక ఫెర్రీని.. స్పీడ్‌బోట్ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో పడవలో 114 మంది ఉన్నట్టు అధికారులు దృవీకరించారు. కాగా, ఫెర్రీ బోల్తా పడటంతో ప్రయాణికులను రక్షించేందుకు కోస్ట్ గార్డ్ బోట్, 11 నేవీ బోట్లు, 3 మెరైన్ పోలీస్ బోట్లు రంగంలోకి దిగాయి.
అయితే ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు నేవీ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, సహాయక చర్యల్లో 101 మందిని రక్షించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ముంబైకి సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎలిఫెంటా దీవులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
- Advertisement -