Tuesday, November 19, 2024

తెలంగాణ ప్రవేశ పరీక్షలకు కొత్త కన్వీనర్లు నియమించిన ఉన్నత విద్యామండలి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలకు నూతన కన్వీనర్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి నియమించింది. అలాగే ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలను నిర్వహించే యూనివర్సిటీలను సైతం ఖరారు చేసింది.

టీఎస్‌ ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్‌ ప్రొఫెసర్‌ బి.డీన్‌ కుమార్‌, పీజీఈసెట్‌ కన్వీనర్‌- జేఎన్టీయూహెచ్‌ ప్రొఫెసర్‌ బి.రవీంద్రరెడ్డి, ఐసెట్‌ కన్వీనర్‌- కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్‌ పి.వరలక్ష్మీ, ఈసెట్‌ కన్వీనర్‌- ఓయూ వర్సిటీ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేష్‌, లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ కన్వీనర్‌- ఓయూ వర్సిటీ ప్రొఫెసర్‌ బి.విజయలక్ష్మీ, ఎడ్‌సెట్‌ కన్వీనర్‌- ఓయూ వర్సిటీ ఫ్రొఫెసర్‌ ఎ.రామకృష్ణ, పీఈసెట్‌ కన్వీనర్‌గా ఓయూ వర్సిటీ ప్రొఫెసర్‌ రాజేష్‌ కుమార్‌లను నియమించింది. అదేవిధంగా ఎంసెట్‌, పీజీఈసెట్‌ నిర్వహణ బాధ్యతను జేఎన్టీయూహెచ్‌కు అప్పగించగా, ఐసెట్‌ను కాకతీయ వర్సిటీకు, లాసెట్‌, పీజీఎల్‌సెట్‌, ఈసెట్‌లకు ఉస్మానియా వర్సిటీకు, ఎడ్‌సెట్‌ను మహాత్మాగాంధీ వర్సిటీ, పీఈసెట్‌ను శాతవాహన వర్సిటీకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement