566 కిలోమీటర్ల ఆల్ ఎలక్ట్రిక్ రేంజ్లో బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ ఐఎక్స్ ఎమ్60 కారును బీఎండబ్ల్యూ ఆవిష్కరించింది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్-2022)లో ఈ కారుని ప్రదర్శించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం తయారుచేసిన బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎమ్60 కారు 610 బీహెచ్పీ సామర్థ్యంతో 1015 ఎన్ఎం టార్క్ కలిగివుంది. కేవలం 3.8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుంది.
ఈ కారు అధిక లోడ్స్లోనూ శక్తివంతమైన వేగంతో స్థిరంగా ప్రయాణించగలదు. స్పోర్ట్స్ బ్రేక్ సిస్టమ్‌తో లభిస్తుంది. కాగా గరిష్ఠ వేగం 250 కేఎంపీహెచ్గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 566 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. జూన్ 2020 ప్రారంభం నుంచి ఈ కారు గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital