జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఎప్పటికప్పుడు అధునాతన బైక్‌లను లాంచ్ చేస్తూ వా#హనదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇండియాలో ఇది రకరకాల ప్రీమియం బైక్‌లను లాంచ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 14న ఇండియాలో ఎఫ్ 900 ఎక్స్‌ఆర్ బైక్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను రూ.12.3 లక్షల ధరతో రిలీజ్ చేసింది. 895సీసీ ఇంజన్‌తో వచ్చే ఇది 105 అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేవలం 3.6 సెకన్లలో గంటకు 100 కిమీల వేగాన్ని అందుకోవడం విశేషం. ఇది గంటకు గరిష్టంగా 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలదు. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ టూరర్ బైక్ కంప్లీట్లీ బిల్ట్‌అ్ఖప్ యూనిట్‌గా అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అంటే ఇది వేరే దేశంలో కంప్లీట్‌గా అసెంబుల్ అయ్యి ఇండియాకి దిగుమతి అవుతుంది. ఈ బైక్ ని బీఎండబ్ల్యూ మోటోరాడ్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. బైక్ డెలివరీలు జూన్ 2022 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
బీఎండబ్ల్యూ మోటోరాడ్ ప్రపంచంలోని అత్యుత్తమ ప్రీమియం మోటార్‌సైకిళ్లను భారతదేశానికి తీసుకువచ్చింది. మోటార్‌సైక్లింగ్ ప్రియులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సష్టించుకుంది. బైక్ అథ్లెటిసిజం, లాంగ్‌డ్ఖిస్టెన్స్ రైడింగ్ పెర్ఫార్మన్స్ ని ఆఫర్ చేస్తుంది” అని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..