జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీకార్లు తయారీ సంస్థ బీఎండబ్ల్యూకి ఊహించని షాక్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ వెహికల్స్‌లో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 1.03మిలియన్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు బీఎండబ్ల్యూ అధికారికంగా తెలిపింది. కాగా 2017 నుంచి బీఎండబ్ల్యూ ఇప్పటివరకు రెండుసార్లు తమ కార్లును రీకాల్ చేసింది.
ప్రస్తుతం రీకాల్ చేసిన కార్లులో 2006 నుంచి 2013 మధ్య కాలంలో తయారుచేసిన కార్లుతోపాటు 1సిరీస్, 3సిరీస్, ఎక్స్3, 5సిరీస్, ఎక్స్5, జడ్ 4మోడల్ కార్లు ఉన్నాయి. కొత్తగా రీకాల్ చేసిన కార్లులో ఎక్కువ వాహనాలు యూఎస్‌లో 9,17,106, కెనడాలో 98వేలు, దక్షిణకొరియాలో 18వేలు ఉన్నాయని బీఎండబ్ల్యూ వెల్లడించింది. ఇంతకుముందు 2017లో 7,40,000 కార్లు, 2019లో 1,84,00కార్లు వాహనాలను బీఎండబ్ల్యూ రీకాల్ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..