Saturday, November 23, 2024

ఆసియాకప్ పై నీలినీడలు.. శ్రీలంక వేదిక మార్పు ఖాయం

శ్రీలంకలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆసియాకప్‌ టోర్నమెంట్‌ నిర్వహణపై నీలినీడలు అలుముకున్నాయి. ఆసియాకప్‌ కంటే, ముందు జులై 16 నుంచి పాకిస్తాన్‌- శ్రీలంక జట్ల మధ్య టెస్టు సిరీస్‌ ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఇరు జట్లు ఇప్పటికే గాలే వేదికగా ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పాక్‌తో టెస్టు సిరీస్‌ను ఉపసంహరించుకోవడం దిశలో శ్రీలంక క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పాక్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల తర్వాత శ్రీలంక వేదికగా ఆసియాకప్‌-2022 టోర్నమెంట్‌ జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంకలో టోర్నీ నిర్వహించకపోవడమే ఉత్తమమనే భావనకు ఆసియా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీసీ) వచ్చినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌ వేదికగా టోర్నమెంట్‌ నిర్వహణకు సన్నాహాలు చేస్టున్నట్లు ఏసీసీ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ టోర్నమెంట్‌ జరగాల్సి ఉంది. ఈ టోర్నీ నిర్వహణకు సంబంధించి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ)తో ఏసీసీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement