ముజఫర్‌నగర్ అల్లర్ల సమయంలో 60 మందికి పైగా హిందువులను ఊచకోత కోశారని, 1500 మందికి పైగా హిందువులను జైళ్లోకి నెట్టారని, సమాజ్‌వాదీ టోపీ రక్తం మరకలతో నిండిపోయిందని సీఎం యోగీ ఆదిత్యనాథ్ విమర్శించారు. ఈ టోపీని అమాయక రామభక్తుల రక్తంతో పెయింట్ చేశారని ఎద్దేవా చేశారు. బాగ్‌పట్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాల్గొని మాట్లాడారు. 2017కు ముందు యూపీలో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా ఉండేదని, మహిళలకు భద్రత ఉండేది కాదని.. ఆ కారణంగానే ఆడ పిల్లలు స్కూళ్లకు కూడా వెళ్లలేక పోయేవారని గుర్తు చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల్లో చాలా మంది నేరస్తులు ఉన్నారని, అలాంటి వారికి టికెట్లు ఇవ్వడం అంటే.. యూపీని మళ్లిd మాఫియా అడ్డాగా మార్చడమే అవుతుందని ఆరోపించారు. మొరాదాబాద్‌లో చాలా మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉందన్నారు. వీరిలో ఒకరు ఆఎn్గానిస్తాన్‌లో తాలిబన్లను చూడటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మానవత్వానికి వ్యతిరేకులైన తాలిబన్లకు సపోర్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. నేరగాళ్లు ఎమ్మెల్యేలు అయితే.. వారు తుపాకులే తయారు చేస్తారని.. ఫ్లవర్స్ కాదంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి వాళ్లకు జేసీబీలు, బుల్డోజర్లతో సమాధానం చెప్పాలన్నారు.