నేడు ప్రపంచ రక్త దాతల దినోత్సవం..కాగా దేశ ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి కీలక సందేశం ఇచ్చారు. ఇతరత్రా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా… రక్త దానాన్ని మాత్రం మెగాస్టార్ చిరంజీవి వదిలేయలేదు. చిరంజీవి బ్లడ్ అండ్ ఐబ్యాంక్ పేరిట ఓ సంస్థని నెలకొల్పారు. ఏటా తాను రక్తదానం చేస్తూ తన అభిమానులతో పాటు పెద్ద సంఖ్యలో యువతను ఆ దిశగా నడిపిస్తూ చిరంజీవి సాగుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా ఓ అద్భుతమైన సందేశాన్ని చిరంజీవి విడుదల చేశారు. ఇతరుల ప్రాణాలను కాపాడే విషయాల్లో అత్యంత సులువైన మార్గం రక్త దానమేనని ట్వీట్ లో తెలిపారు చిరంజీవి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలో మనం నిలిచామని చెప్పిన చిరు… ప్రపంచ రక్త దాతల దినోత్సవాన ప్రపంచంలోనే అత్యధిక రక్త దాతలున్న దేశంగా ఆవిర్భవిద్దామని పిలుపునిచ్చారు. రక్త దానం చేయండి.. ప్రాణాలను నిలబెట్టండి అంటూ ఆయన తన ట్వీట్‌కు ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశారు. ఈ సందర్భంగా వివిధ సమయాల్లో తాను రక్త దానం చేసిన ఫొటోలను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. చిరంజీవి ట్వీట్ వైరల్ గా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement