Tuesday, November 26, 2024

బ్లాక్ ఫంగస్‌ వ్యాక్సిన్‌ తయారీకి మరో ఐదు కంపెనీలకు అనుమతి

ఫంగస్‌ చికిత్సకు వినియోగించే అంఫోటెరిసిన్-బీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు మరో కొత్తగా ఐదు ఫార్మా కంపెనీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మూడు రోజుల్లో అన్ని రకాల అనుమతులు మంజూరు చేయనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ప్రాణాంతక ఫంగస్‌ సోకి రోగులు కంటిని చూపును కోల్పోగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో బ్లాక్‌ ఫంగస్‌ వ్యాక్సిన్లతో పాటు మందుల కొరతపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది.

ఇక రాబోయే రోజుల్లో వ్యాక్సిన్‌ కొరత తీరుతుందని సెంట్రల్‌ కెమికల్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫార్మా కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తిని పెంచడం ప్రారంభించాయని ఆయన అన్నారు. మరో వైపు అంఫోటెరిసిన్‌-బీ ఆరు లక్షల ఇంజక్షన్ల దిగుమతికి భారతీయ కంపెనీలు ఆర్డర్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఉన్న ఎలాంటి అవకాశాలను వదిలిపెట్టడం లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement