Sunday, November 17, 2024

కోయంబత్తూరులో 30 మంది కంటిచూపు మింగేసిన బ్లాక్‌ఫంగస్‌

కరోనా సోకి తగ్గిన అనంతరం కొంతమందికి బ్లాక్‌ ఫంగస్‌గా ఇబ్బందులు గురిచేస్తున్న విషయం తెలిసిందే…అయితే బ్లాక్‌ ఫంగస్‌ కారణంగా అనారోగ్యంపాలైన 264 మంది పేషెంట్లలో 30 మందికి ఒక్క కన్ను చూపు పూర్తిగా పోయిందని స్థానిక కోయంబత్తూరు లోని ప్రభుత్వాస్పత్రి వర్గాలు తెలిపాయి. బ్లాక్సో కి ఆస్పత్రిలో చేరినవారందరికీ ఎండోస్కోపీ చేశామని, 110మందికి చూపు తెప్పించే శస్త్ర చికిత్స చేశామని డా. నిర్మల చెప్పారు. అయితే 30 మంది పేషెంట్లలో ఈ ఫంగస్‌ తీవ్ర ప్రభావం చూపడంతో ఒక కన్ను చూపు పూర్తిగా పోయిందన్నారు. అయితే బ్లాక్‌ ఫంగస్‌ సోకిన తొలినాళ్లలో వచ్చినవారందరికీ నయమైందని చెప్పారు.

ఇది కూడా చదవండి: కామాంధ బ్యాంక్ మేనేజర్, లోను కోసం వచ్చిన మహిళలపై లైంగిక వేధింపులు

Advertisement

తాజా వార్తలు

Advertisement