Thursday, November 21, 2024

ఉల్లిగడ్డలతో బ్లాక్‌ఫంగస్‌ వస్తుందా..?

ఉల్లి లేని ఇల్లులేదు.  అన్నిర‌కాల కూర‌ల్లో ఉల్లి త‌ప్ప‌నిస‌రి.  కొన్నిసార్లు ఉల్లి కోయ‌కుండానే క‌న్నీళ్లు పెట్టిస్తూ ఉంటుంది.  ఇలాంటి ఉల్లి ఇప్పుడు మ‌రో లొల్లికి కార‌ణ‌మైంది.  ఉల్లిపైన ఉండే పోర‌లు నల్ల‌టి మ‌చ్చ‌లు క‌నిపిస్తుంటాయి.  ఆ మ‌చ్చ‌లే సోష‌ల్ మీడియాలో పెద్ద చర్చ‌కు దారీతీసింది.  ఉల్లి పొర‌ల‌పై ఉండే న‌ల్ల‌ని ఫంగ‌స్ వ‌ల‌న బ్లాక్ ఫంగ‌స్ సోకుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.  దీంతో ఉల్లిని కొనుగోలు చేయ‌డానికి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డ్డారు.  అయితే, ఇదంతా తప్పుడు ప్ర‌చారం అని, ఎయిమ్స్ పేర్కొన్న‌ది.

అంతేకాదు కూరలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే వాటిమీద ఏర్పడే బ్యాక్టీరియా కూడా ప్రమాదకరమేనని, ఫ్రిజ్‌లో నీళ్లబాటిళ్లు, కూరగాయలు పెట్టే చోట నల్లగా పేరుకుపోయిన బ్యాక్టీరియా కూడా బ్లాక్‌ ఫంగస్‌కు దారి తీయవచ్చు అనే పోస్టు సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ అవుతున్నది. ఇదంతా తప్పుడు ప్రచారమని ఆలిండియా మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) తెలిపింది. కూరగాయలు, వస్తువుల ద్వారా బ్లాక్‌ ఫంగస్‌ రాదని స్పష్టం చేసింది. ఉల్లిగడ్డల మీద కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్‌ వల్ల ఏర్పడుతుంది. అది బ్లాక్‌ ఫంగస్‌కు దారి తీయదు. ఇక ఫ్రిజ్‌లో ఏదైనా ఎక్కువరోజులు నిల్వ ఉంచితే అందులో ఉండే ఉష్ణోగ్రత కారణంగా అందులో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఇది కూడా మ్యూకోర్మైకోసిస్‌కు కారణం కాదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement