కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారికి తాజా అధ్యయనం ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. వ్యాక్సిన్ తీసుకోని వారికి కరోనా సోకినట్లయితే బ్లాక్ ఫంగస్ ముప్పు ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది మే నుంచి జులై వరకు ఈఎన్టీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, డెంటల్, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీ, ఇతర వైద్యులు అధ్యయనం నిర్వహించారు. ప్రత్యేక నమూనాలో రోగుల వివరాలు సేకరించి ఆరోగ్య పరీక్షల ఫలితాలను క్రోడీకరించి ప్రాథమిక నివేదికను తయారు చేశారు. ఈ అధ్యయనంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని వారిలో బ్లాక్ ఫంగస్ ముప్పు పెరిగినట్లు తేలింది. అలాగే పలువురు బాధితుల్లో డెల్టా వేరియంట్ లక్షనాలు కనిపించాయి. ఒక డోసు కూడా వ్యాక్సిన్ పొందనివారు, రోగనిరోధక శక్తి తగ్గి చక్కెర వ్యాధి కలిగి రక్తంలో ఇనుము శాతం ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ మంది బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు.
ఇది కూడా చదవండి: నటనకు బ్రేక్ ఇవ్వనున్న సమంత.. గుడ్ న్యూస్ చెప్పడానికేనా?